తెలంగాణ
Etala Rajender: రియల్ ఎస్టేట్ బ్రోకర్ చెంప చెల్లుమనిపించిన ఎంపీ ఈటల

Etala Rajender: రియల్ ఎస్టేట్ బ్రోకర్‌పై ఎంపీ ఈటల రాజేందర్ చేయి చేసుకోవడం సంచలనంగా మారింది. జిల్లాలోని పోచారం మున్సిపాలిటీ ఏకశిల నగర్‌లో ఎంపీ పర్యటించారు. పేదల భూములను ఓ రియల్ ఎస్టేట్ బ్రోకర్ ఆక్రమించాడని ఆయనకు ఫిర్యాదులు అందాయి.
ఈ నేపథ్యంలో పేదల భూములు కబ్జా చేయడంతో ఆగ్రహించిన రాజేందర్ స్థిరాస్తి వ్యాపారిపై దాడి చేశాడు. ఇదే సమయంలో ఎంపీ అనుచరులు, బాధితులు సైతం రియల్ ఎస్టేట్ వ్యాపారిపై దాడికి పాల్పడ్డారు. ఈ నేపథ్యంలో ఎంపీ ఈటల రియల్ ఎస్టేట్ బ్రోకర్ చెంప చెల్లుమనిపించారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.