కన్నడ నటి రన్యారావు ఆస్తులు జప్తు!

Ranya Rao: కన్నడ నటి రన్యారావు బంగారం స్మగ్లింగ్ కేసులో చిక్కుకున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో తాజాగా ఆమె కోట్ల ఆస్తులను ఈడీ జప్తు చేసింది. కేసు విచారణలో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
బంగారం స్మగ్లింగ్ కేసులో అరెస్టైన కన్నడ నటి రన్యారావు ఆస్తులపై ఈడీ కన్నేసింది. బెంగళూరులోని విక్టోరియా లేఅవుట్‌లో ఇల్లు, అర్కావతి లేఅవుట్‌లో నివాస స్థలం, అనేకల్‌లో వ్యవసాయ భూమి, తుమకూరులో పారిశ్రామిక భూమిని జప్తు చేశారు. ఈ ఆస్తుల విలువ రూ.34.12 కోట్లుగా అంచనా. దుబాయ్ నుంచి 14 కేజీల బంగారం, రూ.13 కోట్ల విలువైన స్మగ్లింగ్‌లో రన్యా పట్టుబడ్డారు.
సీబీఐ, డీఆర్ఐ అధికారులు బెంగళూరు విమానాశ్రయంలో ఆమెను అరెస్టు చేశారు. పీఎంఎల్ఏ చట్టం కింద విచారణ సాగుతోంది. రన్యా బెయిల్ పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది. ఈ కేసులో తెలుగు నటుడి ప్రమేయం కూడా ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. వాట్సాప్ చాట్‌లు, బ్యాంక్ లావాదేవీలను ఆధారంగా దర్యాప్తు కొనసాగుతోంది.