తెలంగాణ
Peddagattu Jathara: వైభవంగా పెద్దగట్టు లింగమంతులస్వామి జాతర

Peddagattu Jathara: తెలంగాణలో రెండో అతిపెద్ద జాతర సూర్యాపేట పెద్దగట్టు లింగమంతులస్వామి జాతర వైభవంగా జరుగుతోంది. దూరజ్పల్లి పెద్దగట్టుకు దేవరపెట్టే చేరుకుంది. జాతర నేపథ్యంలో ఇవాళ భక్తులు గంపల ప్రదక్షిణలు చేసి మొక్కులు చెల్లించుకుంటున్నారు. వేలాది మంది భక్తులు తరలిరావడంతో ఆలయం భక్తులతో కిక్కిరిసిపోయింది.
పెద్దగట్టుకు దేవరపెట్టే తరలించే కార్యక్రమంలో మాజీమంత్రి, స్థానిక ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి, మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ పాల్గొన్నారు. లక్షలాది మంది భక్తులు ఓలింగ అంటూ గుట్ట పైకి చేరుకుంటున్నారు. తెలుగురాష్ట్రాలతోపాటు ఛత్తీస్గఢ్, ఒరిస్సా రాష్ట్రాల నుంచి భక్తులు తరలివస్తున్నారు.