బీజేపీ నేత ఇంటి ముందు రోహింగ్యాల రెక్కీ

Andela Sriramulu Yadav: పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. ఆపరేషన్ సింధూర్ తర్వాత మన దేశంలో ఉంటున్న పాకిస్థాన్ పౌరులు వాళ్ల దేశానికి వెళ్లిపోవాలని కేంద్రం అల్టీమేటం జారీ చేసింది. ఇందులో భాగంగా చాలా మందిని పాకిస్థాన్ కు పంపేసింది. ఉన్నవారికి ఎలాగో శిక్షలు తప్పవు అంతవరకు బాగానే ఉంది.
మరీ రోహింగ్యాల పరిస్థితి ఏంటి..? వేల సంఖ్యలో ఉన్న రోహింగ్యాలతో ఇండియాకు ఎప్పటికైనా ప్రమాదం తప్పదా అంటే… అవుననే సమాధానం వినిపిస్తుంది. ఇందుకు నిదర్శనమే హైదరాబాద్‌లో బీజేపీ నేత ఇంటిపై రోహింగ్యాలు రెక్కీ నిర్వహించడం అంటున్నారు నిపుణులు. ఇంతకు రోహింగ్యాలపై భారత్ సర్కార్ చర్యలు తీసుకుంటుందా..? లేదా..? అనేది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
ఆపరేషన్ సింధూర్ తర్వాత వివిధ రాష్ట్రాల్లో ఉన్న పాక్ పౌరులు చాలా మంది ఇండియా విడిచి పాకిస్తాన్ వెళ్లిపోయారు. కానీ.. పాక్ పౌరుల ముసుగులో ఉన్న ఉగ్రవాదులు ఇంకా ఉండవచ్చన్న వాదన కూడా ఉంది. అయితే పాకిస్తాన్ పౌరులను ఆ దేశానికి తిరిగి పంపాలని కేంద్రం నిర్ణయించిన నేపథ్యంలోనే.. అందరి దృష్టి కూడా మయన్మార్ దేశానికి చెందిన రోహింగ్య ముస్లింలపై పడింది. రోహింగ్యాలు ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో ఓ పెద్ద సంఖ్యలో ఉన్నట్లు తెలుస్తోంది.
రోహింగ్యాలు శరణార్థుల ముసుగులు వేసుకుని నగర శివారులోని బాలాపూర్, పాడి షరీఫ్, జల్ పల్లి, కంచన్ బాగ్ లాంటి ప్రాంతాల్లో అక్రమంగా నివాసం ఉంటున్నట్లు సమాచారం. వేలాది మంది రోహింగ్యాలు అక్రమ మార్గంలో వచ్చి హైదరాబాద్ నగరంలో స్థిరపడ్డారు. వారిలో కొందరు తాము భారతీయులేనంటూ ఏకంగా భారత పౌరసత్వ కార్డులను కూడా పొందారు. బాలాపూర్ రాయల్ కాలనీలోని వీరి క్యాంపులో గతంలో తలదాచుకున్న ఓ ఉగ్రవాదుడిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.
ఈ తరుణంలో మహేశ్వరం నియోజకవర్గం బీజేపీ నేత అందెల శ్రీరాములు యాదవ్ ఇంటి ముందు రోహింగ్యాల రెక్కీ నిర్వహించడం కలకలం రేపింది. మొదటి నుంచి రోహింగ్యాలపై అందెల శ్రీరాములు ఫైట్ చేస్తున్నారు. దీంతో రోహింగ్యాలను అందెలపై దాడి చేసే కుట్రలో భాగంగా రెక్కీ నిర్వహించినట్టుగా తెలుస్తోంది. శ్రీరాములు ఇంటి ముందు అనుమానాస్పదంగా తిరుగుతున్న ఆరుగురు వ్యక్తులను బీజేపీ కార్యకర్తలు, నేతలు గుర్తించారు. వారి వద్ద పెట్రోల్ బాటిల్, సుత్తి, కట్టర్, ఐరన్ రాడ్స్, బాక్స్‌లో పెట్టుకుని రోహింగ్యాలు తిరుగుతున్నారు.
గత కొన్ని రోజులుగా రోహింగ్యాలపై శ్రీరాములు ఉద్యమం చేస్తున్నారు. మయన్మార్ నుంచి శరణార్థులుగా వచ్చిన రోహింగ్యాలను తిప్పి పంపాలనీ అదే విధంగా హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో అక్రమంగా మదర్సాలు నిర్వహిస్తున్నారని ఆరోపిస్తూ ఇటీవల కాలంగా పలు ఆందోళన కార్యక్రమాలు చేస్తున్న బిజెపి నేత ఇంటి వద్ద రోహింగ్యాలు తిరుగుతుండడం అదీ వారి వాహనంలో సుత్తి, పెట్రోలు, ఇనుపరాడ్, కట్టర్ లభించడం అది రెక్కీగా అనుమానాలకు బలం చేకూరి నట్టైంది. ఈ నేపథ్యంలో అందెల శ్రీరాములకు ప్రాణహాని ఉందని బీజేపీ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు.
బీజేపీ నేతలు రోహింగ్యాలను పట్టుకోడానికి ప్రయత్నించగా బండి వదిలి పారిపోయారు. ఐదుగురు వ్యక్తులను గుర్తించి మీర్‌పేట పోలీస్‌స్టేషన్ పోలీసులకు బీజేపీ నేతలు సమాచారం ఇచ్చారు. ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని మీర్‌పేట పోలీసులు విచారిస్తున్నారు. రోహింగ్యాలు ఎక్కడి నుంచి వచ్చారనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
ఇదే విషయంపై కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్.. రాచకొండా పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడారు. అందెల శ్రీరాములుకు తగిన రక్షణ కల్పించాలన్నారు. రోహింగ్యాల కదలికలపై నిఘా ఉంచాలని పోలీసులకు సూచించారు.
దీంతో.. ఇప్పుడు అందరి దృష్టి రోహింగ్యాలపై పడింది. కాగా హైదరాబాద్ ఓల్డ్ సిటీలో భారీగా రోహింగ్యాలు నివాసం ఉంటున్నట్లు తేలింది. కేవలం మయన్మార్ , బంగ్లాదేశ్ నుంచి వారు హైదరాబాద్‌కు వచ్చినట్లు తెలుస్తోంది. స్థానికంగా 12 వందల కుటుంబాలు ఉంటున్నట్లు అధికారులు చెబుతున్నారు. అయితే అనధికారంగా వారి సంఖ్య 40 వేల కు పైగానే ఉంటుందని తెలుస్తోంది.
2012లో మయన్మార్ లో జరిగిన అల్లర్ల కారణంగా మొదట 210 మంది రోహింగ్యాలు బాలాపూర్ లో తలదాచుకున్నారు. కాల క్రమేనా మరికొంత మంది కూడా రావడంతో రోహింగ్యాల సంఖ్య ఇప్పుడు భారీగా పెరిగిపోయింది. దేశ భద్రతకు ముప్పు వాటిల్లే అటువంటి పరిస్థితుల ఉన్న నేపథ్యాన్ని వివరిస్తూ బీజేపీ ఆధ్వర్యంలో బాలాపూర్ తహస్థీలార్, కలెక్టర్ కు వినతి పత్రాలు సమర్పించారు.
ముఖ్యంగా పాతబస్తీలోని చాంద్రాయణ గుట్ట, బాలాపూర్, ఆషామాబాద్, కాలా పత్తర్, ఫలక్ నుమా, బార్కాస్, షాహిన్ నగర్ వంటి ప్రాంతాల్లో వీళ్లు ప్రముఖంగా ఉన్నారు. ముఖ్యంగా మన దేశానికి చెందిన వారైతే ఎక్కువ డబ్బులకు పనిచేస్తారు. వీళ్లు మాత్రం ఎంత ఇస్తే అంత తీసుకుంటారు. అది అక్కడ ముస్లిమ్స్ కు వరంగా మారింది. కొంత మంది సంపన్న ముస్లిమ్స్ తక్కువ జీతానికి వస్తున్నారని వీరిని తమ దగ్గర పనిలో పెట్టుకున్నారు.
ఇలా పనిచేస్తున్న వారిలో స్లీపర్స్ సెల్స్ కూడా ఉన్నట్టు ఇంటెలిజెన్స్ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా ఈ రోహింగ్యాలు బర్మా దేశంలో వాళ్లు చేస్తోన్న అరాచకాలు భరించేలేక అక్కడునున్న బుద్ధిస్టులు వారిని తన్ని తరిమేసారు. వీరు మన దేశంలో పశ్చిమ బంగాల్ తో పాటు ఈశాన్య రాష్ట్రాల గుండా మన దేశంలోకి ప్రవేశిస్తున్నారు.
పోలీసులు రికార్డ్ ల ప్రకారం బాలాపూర్ పరిధిలో సుమార్ 6వేల మంది వరకు రోహింగ్యాలు నివాసం ఉంటున్నారు. ఇక్కడ పరిస్థితులపై పట్టు సాధించి బాలాపూర్ పరిసర ప్రాంతాల్లో నివాసం ఉంటున్న రోహింగ్యాలు స్థానికంగా ఉన్న కొందరిని మచ్చిక చేసుకుని ఏకంగా భారత గుర్తింపు కార్డులు సైతం పొందుతున్నారు. ఓటర్ గుర్తింపు కార్డు మొదలుకోని ఆదార్డ్, డ్రైవింగ్ లైసెస్స్ పొందుతున్నారు. తర్వాత వీరు మెల్లగా మెజారిటీ ప్రాంతాలైన హిందువులు ఉండే ప్రాంతాల్లో వచ్చి అన్ని రకాల వ్యాపారాలను చేజిక్కించుకుంటున్నారు.
నిజానికి రోహింగ్యాలకు భారత్‌కు చాలా ప్రమాదమే పొంచి ఉంది. ఇప్పటికే మన దేశంలో జనాభా దాదాపుగా 150 కోట్లకు చేరుకుంది. ఉన్నవారి అవసరాలను తీర్చడానికి మన దగ్గర ఉన్న వనరులు సరిగ్గా సరిపోవడం లేదు. ఇక శరణార్థుల పేరుతో ఇండియాలోకి అక్రమంగా చోరబడ్డటువంటి రోహింగ్యాల అవసరాలను తీర్చడం అంటే మన పౌరుల నోటి దగ్గర కూడా లాగేయడమే అవుతుందని కదా అందుకే రోహింగ్యాలను దేశం నుంచి బయటకు పంపివేయాలని ఎప్పటి నుంచో ఆందోళనకు వ్యక్తం అవుతున్నాయి.
అసలు రోహింగ్యాలు ఎవరు అంటే ముస్లింలలో ప్రత్యేకమైన తేగకు చెందిన వారు. సుమారు 10లక్షలు మంది రోహింగ్యాలు తరతరగాలుగా మయన్మార్ లో నివసిస్తున్నారు. కానీ 1982లో మయన్మార్ సర్కార్ తీసుకొచ్చిన పౌరసత్వ చట్టంలో రోహింగ్యాలను తమ పౌరులుగా గుర్తించలేదు. రోహింగ్య బెంగాలి పదం అని వారంతా బెంగ్లాదేశ్ నుంచి వచ్చిన వారని మయన్మార్ వాదిస్తోంది.
తమ దేశం నుంచి వెళ్లిపోయేలా చర్యలు కూడా తీసుకుంటుంది. దీంతో వారంతా కూడా హింసను బరించలేక వలస వెళ్లిపోతున్నారు. దొంగ చాటుగా భారత్ లోకి ప్రవేశించి ఇక్కడే తిష్ట వేస్తున్నారు. తమ సంతతనిని పెంచుకుంటూ పోతున్నారు. రోహింగ్యాల ముసుగులో చట్ట వ్యతిరేకంగా డ్రగ్స్, వ్యభిచారం లాంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు.
భారత ప్రభుత్వం అక్రమంగా భారత్ లో స్థిర నివాసం ఉంటున్న వారిపై కఠినంగా వ్యవహరించడంతో వారి దేశాలకు డిపోర్ట్ చేసే పనిలో పడింది. మరి పాక్ జాతీయులను బయటకు తరమితేస్తున్న ఇండియా సర్కార్ హైదరాబాద్‌లో అక్రమంగారాజ్యమేలుతున్న రోహింగ్యాలను ఏ రకంగా వాళ్ల దేశానికి డిపోర్ట్ చేస్తారన్నది చూడాలి.