వామనరావు హత్య కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన సీబీఐ

పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం కాల్వచర్ల వద్ద 2021 ఫిబ్రవరి 17న జరిగిన న్యాయవాదులు గట్టు వామన్‌రావు, గట్టు నాగమణి దంపతుల హత్యకేసు దర్యాప్తు బాధ్యతలను సీబీఐ చేపట్టింది. ఈ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని కోరుతూ వామన్‌రావు తండ్రి గట్టు కిషన్‌రావు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో దర్యాప్తు బాధ్యతలను సీబీఐకి అప్పగిస్తూ ఆగస్టు 12న సుప్రీంకోర్టు జారీచేసిన ఉత్తర్వుల మేరకు సీబీఐ తాజాగా ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. ఈ హత్య కేసులో కిషన్‌రావు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా రామగిరి పోలీస్‌స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదైంది.
అయితే ఈ కేసు దర్యాప్తును చేపట్టి తుది నివేదిక దాఖలు చేయాలని సుప్రీంకోర్టు ఆగస్టు 12న సీబీఐని ఆదేశించింది. ఇది వరకు రామగిరి పోలీస్‌స్టేషన్‌లో నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను అదే సెక్షన్ల కింద మంథని మండలం గుంజపడుగుకు చెందిన వెల్ది వసంతరావు, కుంట శ్రీనివాస్, అక్కపాక కుమార్‌లపై రీరిజిష్టర్ చేసి విచారణ చేపడుతున్నామని సీబీఐ పేర్కొంది. ఈ కేసు దర్యాప్తు అధికారిగా ఇన్‌స్పెక్టర్ విపిన్ గహలోత్ వ్యవహరించనున్నారు. అయితే, ఈ కేసుకు సంబంధించి పాత నిందితులను మళ్లీ అరెస్ట్ చేయకూడదని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది.



