News
సింగర్ మంగ్లీపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదు

ప్రముఖ సినీ గాయని మంగ్లీ మరో వివాదంలో చిక్కుకుంది. మైక్రో ఫైనాన్స్ పేరిట కోట్ల రూపాయల మోసానికి పాల్పడ్డారంటూ మంగ్లీతో పాటు ఆమె సోదరుడు, మరో ముగ్గురిపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. సుమారు 10 కోట్ల రూపాయల మేర తమను మోసం చేశారంటూ బాధితుడు సుబ్బారావు పోలీసులను ఆశ్రయించారు.
పెట్టిన పెట్టుబడి తిరిగి ఇవ్వాలని కోరితే.. మంగ్లీ, ఆమె సోదరుడు తనను బెదిరిస్తున్నారని, తనకు ప్రాణహాని ఉందని బాధితుడు తన ఫిర్యాదులో తెలిపారు. బాధితుడి ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు..BNS సెక్షన్ 351(2), 352 కింద కేసులు నమోదు చేశారు. గతంలోనూ పలు వివాదాల్లో నిలిచిన మంగ్లీ.. ఇప్పుడు ఈ ఆర్థిక మోసం కేసులో ఇరుక్కోవడం చర్చనీయాంశంగా మారింది.



