తెలంగాణ
KTR: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై కేసు నమోదు

KTR: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై కేసు నమోదైంది. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. సీఎం రేవంత్‌రెడ్డిపై కేటీఆర్ అనుచిత వ్యాఖ్యలు చేశారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఫిర్యాదు చేశారు. కేటీఆర్ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోలను సైబర్ క్రైమ్ పోలీసులకు అందించారు. ఆయన వ్యాఖ్యలు సీఎం ప్రతిష్ఠను దెబ్బతీసేలా ఉన్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు.