News
Daaku Maharaaj: థియేటర్ వద్ద బాలయ్య ఫ్యాన్స్ అరాచకం.. షాక్ ఇచ్చిన పోలీసులు
Daaku Maharaaj: డాకు మహరాజ్ సినిమా విడుదల సందర్భంగా తిరుపతి లోని గ్రూప్ ధియేటర్ వద్ద అభిమానుల అత్యుత్సాహం ప్రదర్శించారు. థియేటర్ ముందు బహిరంగ జంతుబలి పాల్పడ్డారు. దీనిని వీడియో తీసిన కొందరు సోషల్ మీడియా లో హల్ చల్ చేయడం తో దానిపై తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. బహిరంగంగా జంతు బలి ఇచ్చి రక్తాన్ని పోస్టర్ పై పూయడంతో జంతు చట్టం కింద కేసు నమోదు చేశారు పోలీసులు.
ఇందులో ఐదు మందిని గుర్తించామని వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశామన్నారు డిఎస్పి వెంకట నారాయణ. ప్రపంచ ఆధ్యాత్మిక నగరం లో చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడరాదని, ప్రజలందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు.