తెలంగాణ
దుర్గం చెరువు ఆక్రమించారని బీఆర్ఎస్ ఎమ్మెల్యేపై కేసు

Kotha Prabhakar Reddy: దుర్గం చెరువు ఆక్రమణల వ్యవహారంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డితో పాటు వెంకట్‌రెడ్డి అనే వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. 2014లో HMDA ఇచ్చిన చెరువు హద్దుల ఆధారంగా హైడ్రా సర్వే చేపట్టింది. చెరువు వద్ద 5 ఎకరాలు ఆక్రమణకు గురైనట్లు హైడ్రా గుర్తించింది. ఆక్రమించిన భూమి ద్వారా నిందితులు అక్రమ ఆదాయం పొందుతున్నారని హైడ్రా ఆరోపిస్తుంది.



