తెలంగాణ
Hyderabad: కారులో చెలరేగిన మంటలు.. తృటిలో తప్పిన ప్రాణాపాయం

Hyderabad: హైదరాబాద్ లంగర్ హౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒలిం ఆస్పత్రి సమీపంలో రోడ్డుపై వెళ్తున్న ఓ కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన ప్రయాణికులు కారులో నుండి క్షేమంగా బయటకు దిగారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.



