ఆంధ్ర ప్రదేశ్
అల్లూరి జిల్లా మోతుగూడెంలో కారు దగ్ధం

అల్లూరి జిల్లా మోతుగూడెం శివారు ప్రాంతంలో షార్ట్ సర్క్యూట్‌తో కారు దగ్ధమైంది. అనకాపల్లి జిల్లా కొత్తపాలెం గ్రామం నుంచి నలుగురు వ్యక్తులు కారులో బయల్దేరారు. ఈ క్రమంలోనే వైరింగ్‌లో ఏర్పడిన లోపంతో ఇంజిన్ నుంచి మంటలు చెలరేగి కారు పూర్తిగా దగ్ధమైంది. ప్రమాదాన్ని గమనించిన ప్రయాణికులు కారు దిగిపోవడంతో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని పోలీసులు తెలిపారు.



