తెలంగాణ
Car Accident: ఫ్లై ఓవర్‌పై కారు బీభత్సం.. ముగ్గురికి గాయాలు

Car Accident: హైదరాబాద్ డబీర్‌పురా ఫ్లై ఓవర్‌పై కారు బీభత్సం సృష్టించింది. ఓవర్ స్పీడ్‌తో ఫ్లై ఓవర్‌పై డివైడర్‌ను కారు డీకొని బోల్తా పడింది. దీంతో.. కారులో ప్రయాణిస్తున్న ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. అయితే.. ప్రమాదం జరిగిన వెంటనే కారు దిగి ముగ్గురు యువకులు పరారయ్యారు.
ప్రత్యక్షసాక్షులు ప్రకారం.. యువకులు మైనర్‌లుగా పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. నెంబర్ ప్లేట్ ఆధారంగా వివరాలు సేకరిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.