అంతర్జాతీయం

Afghanistan: డబ్బు కోసం కన్న కూతురిని అమ్మేసిన కసాయి తండ్రి

Afghanistan: ఆఫ్ఘనిస్తాన్‌లో మహిళల పరిస్థితి అధ్వాన్నంగా తయారయ్యింది. అభం శుభం తెలియని ఆడపిల్లకు అన్యాయం జరిగింది. డబ్బు కోసం బాలిక తండ్రి ఆమెను అమ్మేశాడు. చివరికి ఆ చిన్నారి.. చిన్నారి పెళ్లికూతురుగా మారింది. ఏకంగా ఇద్దరు భార్యలు ఉన్న వ్యక్తికి మూడో భార్యగా వెళ్ళింది.

ఆఫ్ఘనిస్థాన్‌ దేశంలో పాలకులు కరుడు గట్టిన ఉగ్రవాదులు. వారి పాలనలో తినడానికి తిండలేక ప్రజలు అల్లాడుతున్నారు. మహిళలు బయటి ప్రపంచానికి దూరమైన పూర్తిగా ఇళ్లలో బందీలుగా మారిపోయారు. ఆడపిల్లకు చదువు, ఉద్యోగం అనేవి కలగా మారాయి. ఇప్పటికే అక్కడ ఆడపిల్లలకు విద్య అవసరం లేదని తీర్పునిచ్చారు. మానవ హక్కులు ఉగ్ర పాలకుల హాయాంలో మచ్చుకైనా కనిపించడం లేదు. తాలిబాన్ల అధికారం చేపట్టినప్పటి నుంచి బాల్యవివాహాలు, బలవంతపు పెళ్లిళ్లు రానురాను పెరిగిపోతూ వస్తోంది. ప్రధానంగా తాలిబాన్ల వల్ల మహిళలు, ఆడపిల్లలు వేధింపులకు కూడా గురవుతున్నారు.

ఈ క్రమంలోనే హేల్మాండ్ ప్రొవిన్స్ లో 45 ఏళ్ల వ్యక్తికి ఆరేళ్ల పాపను పెళ్లి చేయడం సంచలనంగా మారింది. అమ్మాయి కుటుంబానికి పెద్ద మొత్తంలో డబ్బు చెల్లించి ఆరేళ్ల బాలికను వివాహం చేసుకున్నాడు. ఆ కుటుంబీకులు సంతోషంగా ఆరేళ్ల బాలికకు వీడ్కోలు కూడా పలికారు. అయితే అతనికి అప్పటికే ఇద్దరు భార్యలు కూడా ఉన్నారు. డబ్బులు ఇచ్చి మరి ఆ పాపను కొనుగోలు చేశాడట ఆ దుర్మార్గుడు. ఈ వివాహం వాల్వార్ సంప్రదాయం ప్రకారం జరిగింది. ఇందులో వరుడు, వధువు వయస్సు, రూపం, చదువు, కుటుంబ స్థితిగతుల ఆధారంగా నగదు చెల్లిస్తాడు. ఇది భార్యకు ఖరీదు కట్టే ఆచారం. ఒకప్పుడు మనదేశంలో ఉండే కన్యాశుల్కానికి దీనికి దగ్గర పోలికలు ఉన్నాయి.

ఈ న్యూస్ తెలుసుకున్న తాలిబన్లు ఆరేళ్ల చిన్నారిని పెళ్లి చేసుకోవడం తప్పు అని ఆదర్శాలు మాట్లాడి ఆపేశారు. కానీ నేరుగా వచ్చి ఎవరు ఫిర్యాదు చేయలేరు. అయితే.. అక్కడ ప్రభుత్వం మాత్రం దీన్ని పెద్దగా పట్టనట్లు గా వ్యవహరిస్తోంది. ఆ అమ్మాయికి 9 ఏళ్లు వచ్చే వరకు భర్త వేచి ఉండాలని చెబుతోంది. చేసేదేం లేక ఆ వరుడు తల్లిదండ్రుల వద్దే వదిలేశాడు. అయితే ప్రస్తుతం ఆ అమ్మాయి తల్లిదండ్రుల వద్ద ఉంటోంది. వాళ్ల కంటికి ఆరేళ్ల అమ్మాయి మేజర్ కాలేదని కనిపించింది కానీ.. 9 ఏళ్లు నిండితే మాత్రం మేజర్ అయినట్లు కనిపించిదేమో. తాలిబన్ల నిర్ణయం చూసి ప్రపంచం అంతా ఆశ్చర్యానికి గురైంది.

కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రి ఆ కూతురు పట్ల నిర్దయగా ఉన్నాడు. ఈ సందర్భంగా 45 ఏళ్ల వ్యక్తికి తన కూతుర్ని అమ్మేశాడు. ఆఫ్గానిస్థాన్ ఇది ఒక ముస్లిం దేశం. తాలిబాన్ ప్రభుత్వం అధికారంలో ఉంది. అయితే షరియా చట్టం ప్రకారం ఈ ప్రభుత్వ హయాంలో ప్రజల పరిస్థితి దీనంగా మారింది. ముఖ్యంగా మహిళలు. ఏకంగా 45 ఏళ్ల వయసు, రెండు పెళ్లిళ్లు చేసుకున్న వ్యక్తికి ఇచ్చి ఆమెను పెళ్లి చేశారు.

ప్రభుత్వంపై యుద్ధం చేసి పాలన తమ చేతుల్లోకి తీసుకుని నాలుగేండ్లు పూర్తవుతోంది. తాలిబాన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బాల్య వివాహాలు నానాటికి పెరిగిపోతూనే ఉన్నాయి. 2021లో ఏర్పడిన తాలిబన్ ప్రభుత్వంలో ఎన్నో అరాచకాలు నిషేధాలు సమాజాన్ని తిరోగామి దిశగా అంటే ఆధునిక సమాజాన్ని మళ్లీ మధ్యయుగాలకు మత, మౌఢ్య, అంధ విశ్వాల వైపు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ వస్తున్నారు. ఐక్యరాజ్య సమితి ప్రకారం 25% బాల్యవివాహాలు పెరిగాయి.

వీళ్ల అధికారంలో అక్కడ మహిళలు, బాలికలపై కఠినమైన ఆంక్షలు కూడా ఉంటాయి. వారిని విద్య నుంచి దూరంగా ఉంచుతారు. అంతేకాదు పని కూడా చేయకూడదు. పార్కులు, జిమ్‌కు అసలే వెళ్లకూడదు. మొత్తానికి రోడ్డు ఎక్కాలన్నా మగ తోడు ఉండాల్సిందే. బయటకు వచ్చినప్పుడు ఖచ్చితంగా వారి ముఖాన్ని కవర్ చేసుకోవాలి. లేకపోతే వారికి కఠినమైన శిక్షలు ఉంటాయి.

గతంలో తాలిబన్లు అధికారం చేపట్టక ముందు ఆఫ్ఘనిస్తాన్ లో అధికారికంగా యువతి పెళ్లి వయసు.. 16 ఏళ్లుగా ఉండేది. కానీ తాలిబన్లను వచ్చాక విచ్చలవిడిగా బాల్యవివాహాలు కొనసాగుతున్నాయి. మహిళలపై వేధింపులు, అణచివేత, చదువు నిరాకరించడం మొదలైన నిబంధనలు కొనసాగుతున్నాయి. అమ్మాయిలకు చదువు నిషేదించిన తర్వాత బాల్య వివాహాలు 25 శాతం పెరిగిపోయినట్లు ఓ నివేధిక ద్వారా తెలుస్తోంది.

ప్రపంచ దేశాలలో ఎక్కడైనా వివాహ వయసు అటూ ఇటుగా దాదాపు 18 ఏళ్లకుపైనే ఉంది. కానీ కొన్ని దేశాలలో ఇంకా బాల్య వివాహాలు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే ఆఫ్ఘనిస్తాన్ లో బాల్యవివాహాలను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నట్లు చర్యలు తీసుకున్న తాలిబన్లు ఆరేళ్ల పాపను తొమ్మిదేళ్లకు కాపురానికి తీసుకెళ్లవచ్చునని చెప్పడం గమనార్హం. అయితే 9 ఏళ్ల అమ్మాయిని పెళ్లి చేసుకోవడం తప్పు కాదన్నట్లుగా అనధికారిక ఉత్తర్వులు ఇచ్చినట్లైందని విశ్లేషకులు అంటున్నారు.

బాల్య వివాహాల సంఖ్య పెరగడంపై మానవ హక్కుల సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. బాలికల హక్కుల పరిరక్షణకు అంతర్జాతీయ సమాజం జోక్యం చేసుకోవాలని కోరుతున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button