తెలంగాణ
పాతబస్తీలో యువకుడి దారుణ హత్య

హైదరాబాద్ పాతబస్తీలో దారుణం జరిగింది. అరవింద్ అనే యువకుడిపై కత్తులతో దుండగులు దాడికి పాల్పడ్డారు. దీంతో అరవింద్ అక్కడిక్కడే మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్లూస్ టీం ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకున్నారు.



