తెలంగాణ
Harish Rao: ప్రశ్న ఒకటి అడిగితే సమాధానం మరొకటి చెప్తున్నారు

Harish Rao: తెలంగాణ శాసనసభ నుంచి ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ వాకౌట్ చేసింది. ఐదోరోజు కొనసాగుతున్న సభలో బడ్జెట్ పద్దు రోడ్ల భవనాలపై కీలక చర్చ జరిగింది. ఈ క్రమంలో విపక్ష సభ్యులకు అధికార మంత్రులకు మాటల యుద్దం జరిగింది. సభలో మంత్రులు సరైన సమాధానం చెప్పడం లేదని నిరసిస్తూ సభ నుంచి వాకౌట్ చేసినట్లు హరీశ్ రావు తెలిపారు. సభలో మంత్రులు అవాస్తవాలు, సత్యదూరమైన సమాధానాలు చెప్తున్నారన్నారు మాజీ మంత్రులు హరీశ్ రావు. ప్రశ్న ఒకటి అడిగితే సమాధానం మరొకటి చెప్తున్నారన్నారు. నిరసనగా సభ నుంచి వాకౌట్ చేశామని తెలిపారు.