తెలంగాణ
గన్ పార్క్ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నిరసన

గన్ పార్క్ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నిరసన చేపట్టారు. అమరవీరుల స్థూపం వద్ద ఆరు గ్యారెంటీలకు నిధులు కేటాయించాలని ఆందోళనకు దిగారు. రైతులకు వెన్ను పోట్లు..రాహుల్‌కు వెయ్యి కోట్లు అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నినాదాలు చేశారు. రాహుల్ బంధు కాదు..రైతు బంధు కావాలంటూ డిమాండ్ చేశారు.



