తెలంగాణ
ఇవాళ స్పీకర్ ప్రసాద్‌ను కలవనున్న బీఆర్ఎస్ నేతలు

ఇవాళ స్పీకర్ ప్రసాద్‌ను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కలవనున్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని స్పీకర్ ప్రసాద్ కుమార్‌ను బీఆర్ఎస్ నేతలు కోరనున్నారు. ఇప్పటికే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు స్పీకర్ ప్రసాద్ నోటీసులు జారీ చేశారు. అయితే ఇందులో 8 మంది ఎమ్మెల్యేలు తాము ఇంకా బీఆర్ఎస్ లోనే ఉన్నామంటూ నోటీసులకు సమాధానం ఇచ్చారు. అభివృద్ధి పనుల కోసమే సీఎంను కలిశామని స్పష్టం చేశారు.
సీఎం స్థాయి వ్యక్తి కండువా కప్పితే తిరస్కరించడం కరెక్టు కాదనే కప్పుకున్నామని వివరణ ఇచ్చారు. తాము కప్పుకున్నది కాంగ్రెస్ కండువా కాదన్నారు. అది మూడు రంగుల కండువా అని వివరించారు. అయితే పార్టీ మారిన ఎమ్మెల్యేలకు బీఆర్ఎస్ నాయకత్వం చెక్ పెట్టాలని భావిస్తుంది. 10 నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలే లక్ష్యంగా గులాబీ పార్టీ వ్యూహాలు రచిస్తోంది.



