తెలంగాణ
KTR: కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేయడం దుర్మార్గమైన చర్య

Kaushik Reddy: కౌశిక్ రెడ్డి అరెస్టుపై బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా స్పందించారు. కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేయడం దుర్మార్గమైన చర్యగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అభివర్ణించారు. సీఎం రేవంత్ నిరంకుశ వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. కాంగ్రెస్ నేతల అవినీతిని కౌశిక్ రెడ్డి ప్రశ్నిస్తున్నందుకే.. కక్ష కట్టి అక్రమ కేసులు బనాయిస్తున్నారన్నారు.
కౌశిక్ రెడ్డి అరెస్టును మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రంగా ఖండించారు. రేవంత్ రెడ్డి పాలన గాలికొదిలేసి, కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. కేసుల పేరిట వేధిస్తూ రాక్షసానందం పొందుతున్నారని ధ్వజమెత్తారు. ఇందిరమ్మ కాలం నాటి ఎమర్జెన్సీని గుర్తు చేస్తున్నారన్నారు. అరెస్టులతో బీఆర్ఎస్ నేతల మనోధైర్యాన్ని దెబ్బతీయలేరన్నారు.