తెలంగాణ
కుత్బుల్లాపూర్‌లో బీఆర్ఎస్ నేతల నిరసన

కుత్బుల్లాపూర్ జీడిమెట్లలో బీఆర్ఎస్ నేతలు నిరసనకు దిగారు. అబద్ధపు హామీలిచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం కాలం గడుపుతుందని ఫైర్ అయ్యారు. కుత్బుల్లాపూర్‌లోని గాంధీ విగ్రహానికి వినతిపత్రం అందించి నిరసన వ్యక్తం చేశారు.
కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కేపీ వివేకానంద, ఎమ్మెల్సీ శంబీపూర్ రాజు కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న సమస్యలపై ప్రభుత్వం దృష్టి పెట్టి సకాలంలో పరిష్కరించాలని డిమాండ్ చేశారు.