తెలంగాణ
హైదరాబాద్ తెలంగాణ భవన్ వద్ద బీఆర్ఎస్ నాయకుల నిరసన

హైదరాబాద్ తెలంగాణ భవన్ వద్ద బీఆర్ఎస్ నాయకులు నిరసన చేపట్టారు. బీసీ రిజర్వేషన్ల అంశంపై ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ రేవంత్రెడ్డి దిష్టిబొమ్మను బీఆర్ఎస్ నాయకులు దగ్ధం చేశారు ఆర్డినెన్స్ వద్దు చట్టబద్ధత కల్పించాలని బీఆర్ఎస్ నాయకులు నినాదాలు చేశారు. బీసీలకు 42శాతం రిజర్వేషనలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. రిజర్వేషన్లు అమలు వ్యవహారంలో ప్రభుత్వం ద్వంద వైఖరిని అవలంభిస్తుందని బీఆర్ఎస్ నాయకులు ధ్వజమెత్తారు.