తెలంగాణ

సీనియర్ మహిళా జర్నలిస్ట్ రేవతి అరెస్ట్‌ను ఖండించిన బీఆర్ఎస్ నేతలు

సీనియర్ మహిళా జర్నలిస్ట్ రేవతి అరెస్ట్‌ను బీఆర్ఎస్ నేతలు ఖండించారు. రేవతి ఇంటిపై దాడులు చేసి.. ఆమెతో పాటు కుటుంబ సభ్యులను నిర్బంధించి ప్రభుత్వం వేధించిందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. సీఎం రేవంత్ రెడ్డి రేవతి కుటుంబంతో పాటు తనపైన ఒత్తిడి చేస్తూ బెదిరింపులకు దిగుతున్నారని ఆమె ఆరోపించిన నేపథ్యంలో రేవతికి ఎలాంటి ప్రమాదం జరగకుండా చూడాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.

సీఎం రేవంత్ రెడ్డి పాలనలో ప్రశ్నిస్తే బుకాయింపులు, బెదిరింపేలేనన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. సమస్యలు అడిగితే అరెస్ట్ కూడా చేస్తారని వాపోయారు. జర్నలిస్ట్ రేవతి అరెస్ట్ కవిత ఖండిస్తున్నా అన్నారు.

జర్నలిస్టు అక్రమ అరెస్ట్ ను ఖండిస్తున్నా అన్నారు బీఆర్ఎస్ నేత జగదీష్ రెడ్డి. డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే రేవతిని అరెస్ట్ చేశారని ఆరోపించారు. ఇది సీఎం రేవంత్ పిరికిపంద చర్య అని విమర్శించారు జగదీష్ రెడ్డి.

రైతుల బాధను ప్రపంచానికి వినిపిస్తున్న జర్నలిస్ట్ ను అరెస్ట్ చేయడం అంటే లక్షలాదిమంది గొంతు నొక్కడమేనన్నారు. ఇలాంటి అరెస్ట్ లతో కాంగ్రెస్ వైఫల్యాలను కప్పిపుచ్చుకోలేరని అన్నారు. రేవతిని ఎందుకు అరెస్ట్ చేశారో వెంటనే ప్రజలకి చెప్పాలన్నారు. అంతేకాదు అరెస్ట్ అయిన జర్నలిస్ట్‌ రేవతికి జగదీష్ ధైర్యం చెప్పారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button