ఆంధ్ర ప్రదేశ్
Anantapur: నీటి కుంటలో పడి అన్నదమ్ములు మృతి

Anantapur: అనంతపురం జిల్లా పాలవెంకటాపురంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. నీటితొట్టెలో ప్రమాదవశాత్తు పడి ఇద్దరు అన్నదమ్ములు మృతి చెందారు. తమ్ముడిని రక్షించబోయి అన్న నరేంద్ర నీటి మునిగాడు. ఇద్దరికి ఈత రాకపోవడంతో చనిపోయారు. మృతదేహాలను పోలీసులు వెలికి తీశారు. కుమారుల మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. అన్నదమ్ముల మృతితో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి.



