ఆంధ్ర ప్రదేశ్

Minister Anam: రాబోయే రోజుల్లో ఆత్మకూరుని అభివృద్ధి చేస్తాం

Anam Ramanarayana Reddy: ఆత్మకూరు నియోజకవర్గం గత పది 10 సంవత్సరాలు.. అభివృద్ధిలో వెనకబడిందన్నారు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. నెల్లూరు జిల్లా ఆత్మకూరులో స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి.

ఈ సందర్భంగా తడి చెత్త పొడి చెత్త వేరు చేసే విధానంపై మహిళలకు అవగాహన కల్పించారు. అనంతరం తాను శంకుస్థాపన చేసిన ఆర్‌అండ్‌బి గెస్ట్ హౌస్‌ను 12 ఏళ్ల తర్వాత తానే ప్రారంభించాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. రాబోయే రోజుల్లో ఆత్మకూరు నియోజకవర్గ అభివృద్ధికి అన్ని విధాల క‌ృషి చేస్తామని మంత్రి అన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button