ఆంధ్ర ప్రదేశ్

మాజీ సీఎం జగన్‌తో బొత్స భేటీ

విశాఖ స్టీల్‌ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకోవడంలో టీడీపీ కూటమి సర్కార్ విఫలమైందని వైసీపీ ఆరోపిస్తోంది. స్టీల్ ప్లాంట్ కాపాడుకునేందుకు అనుసరించాల్సిన వ్యూహంపై వైసీపీ సమాలోచనలు చేస్తోంది. మాజీ సీఎం జగన్‌రెడ్డితో శాసనమండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ తాడేపల్లిలో భేటీ అయ్యారు.

అందుబాటులో ఉన్న నేతలతో బొత్స సమీక్ష చేస్తున్నారు. కూటమి సర్కార్ దోపిడీపై పెట్టిన శ్రద్ధ విశాఖ స్టీల్ ప్లాంట్‌‌ను కాపాడుకోవడంలో చూపడం లేదని వైసీపీ ఆరోపిస్తోంది. కూటమి సర్కార్ ఫెయిల్యూర్‌ను ప్రజల్లో ఎండగట్టాలని వైసీపీ నిర్ణయించింది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button