ఆంధ్ర ప్రదేశ్
Botsa Satyanarayana: విద్యార్ధులు, నిరుద్యోగలను రాష్ట్ర ప్రభుత్వం మోసం చేసింది

Botsa Satyanarayana: కూటమి ప్రభుత్వంపై ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ఫైరయ్యాడు. విద్యార్ధులు, నిరుద్యోగలను రాష్ట్ర ప్రభుత్వం మోసం చేసిందని ఆయన విమర్శించారు. కూటమి ప్రభుత్వం ఫీజు రియింబర్స్‌మెంట్‌ను ఇవ్వడం లేదని ఆయన ప్రశ్నించారు.
గత ప్రభుత్వంలో విద్యార్ధులకు ఎక్కడా బకాయిలేదన్నారు. నిరుద్యోగులకు అధికారంలోకి రాగానే నిరుద్యోగ భృతి ఇస్తామని మోసం చేశారు. నిరుగ్యోగ భృతి ఎప్పుడు అమలు చేస్తారని ఆయన అన్నారు. యువత కోసం నినదిస్తే తమపై మార్షల్స్‌ను ప్రయోగిస్తారని ఆయన మండిపడ్డారు.