సినిమా

Boney Kapoor: బక్క చిక్కిన బోనీ కపూర్.. సంచలన రూపం!

Boney Kapoor: బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ అద్భుత రూపంతో ఆశ్చర్యపరిచారు. భారీగా బరువు తగ్గి స్లిమ్ లుక్‌లో కనిపిస్తున్న ఆయన ఫోటోలు వైరల్‌గా మారాయి. ఆహార నియమాలతో ఈ మార్పు సాధించిన బోనీ సీక్రెట్ ఏంటో తెలుసుకుందాం.

ప్రముఖ బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ 25 కేజీల బరువు తగ్గి అందరినీ ఆశ్చర్యపరిచారు. కఠిన ఆహార నియమాలు, సరళమైన డైట్‌తో ఈ లక్ష్యాన్ని సాధించారు. సలాడ్‌లు, సూప్‌లు, పండ్లు, జవర్ రోటీలతో కూడిన సాదాసీదా ఆహారం ఆయన రహస్యం. కార్బోహైడ్రేట్లను తగ్గించి, విందులకు దూరంగా ఉన్నారు. అల్పాహారంలో పండ్ల రసాలు, జవర్ రోటీ మాత్రమే తీసుకున్నారు. జిమ్‌కు వెళ్లకుండానే, కేవలం క్రమశిక్షణ, అంకితభావంతో ఈ అద్భుత రూపాన్ని సాధించారు.

బోనీ కొత్త లుక్‌కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్నాయి. క్యాజువల్, సెమీ-ఫార్మల్ దుస్తుల్లో సన్నగా, ఆకర్షణీయంగా కనిపిస్తున్న ఆయన, తన ఫిట్‌నెస్ రహస్యాన్ని అభిమానులతో పంచుకున్నారు. ఇక బోనీ కపూర్ కూతురు జాన్వీ కపూర్ టాలీవుడ్, బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతుంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button