తెలంగాణ

ఉత్తర తెలంగాణలో 3 జిల్లాల్లో చలి బోనాల పండగ

ఉత్తర తెలంగాణలో 3 జిల్లాల్లో చలి బోనాల పండగ నిర్వహిస్తారు. ఒక రోజు ముందు వండి మరుసటి రోజు పోచమ్మ తల్లికి నైవేద్యం చూపిస్తారు. ఈ చలి బోనాల వల్ల తమను, తమ కుటుంబాలను, పాడి పంటలను అమ్మవారు చల్లగా చూస్తారని అక్కడి భక్తుల నమ్మకం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుండి కాకుండా మహారాష్ట్ర ప్రాంతాల నుండి బోనాలను సమర్పించడానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి మొక్కులు తీర్చుకున్నారు.

బోనాలు సమర్పించడం మాత్రమే కాదు ఏదైనా శుభకార్యాలు చేస్తారు. తొలిసారిగా పంట చేతికి వచ్చిన ప్రతి ఒక్కరు అమ్మవారికి బోనాల సమర్పిస్తుంటారు. అనంతరం ఏదైనా శుభకార్యాలతో పాటు గృహప్రవేశాలు, పండుగలు తదితర వాటిని ఆనవాయితీగా చేస్తుంటారు. దీంతో ఆలయాలు ఉదయం నుండి భక్తులతో కిటకిటలాడాయి. ఆయురారోగ్యాలతో.. సుఖసంతోషాలతో ఉండాలని గ్రామ దేవతలను వేడుకొంటారు. పంటలు సమృద్ధిగా పండాలని.. పిల్లాపాపల సుఖసంతోషాలతో ఉండాలని.. గ్రామ దేవతలను వేడుకున్నారు. మహిళలు అధిక సంఖ్యలో బోనాలను సమర్పించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button