చిత్రపురి కాలనీ ప్రెసిడెంట్ వల్లభనేని అనిల్ ఆధ్వర్యంలో చిత్రపురి బోనాలు

హైదరాబాద్ చిత్రపురి కాలనీలో వల్లభనేని అనిల్ కుమార్ గారి ఆధ్వర్యంలో బోనాలు పండుగ సందర్భంగా శ్రీశ్రీశ్రీ కనకదుర్గ అమ్మవారిని హరిహర వీరమల్లు చిత్ర నటి నిధి అగర్వాల్ దర్శించుకోవడం జరిగింది. ఆ చిత్రం ఘన విజయం సాధించాలని కోరుకుంటూ అమ్మవారి ఆశీస్సులను తీసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఆర్టిఐ కమిషనర్ దంపతులు సృజన పివి శ్రీనివాస్ గారు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
అలాగే ఫిలిం ఛాంబర్ పెద్దలు భరత భూషణ్ గారు, దామోదర్ ప్రసాద్ గారు, ప్రసన్నకుమార్ గారు, సి కళ్యాణ్ గారు, భరద్వాజ్ గారు, శంకర్ గారు, తదితర ప్రముఖ రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
వల్లభనేని హైమాంజలి అనిల్ కుమార్ దంపతులు చిత్రపురి కష్టాలు తొలగి ప్రజలంతా ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని అమ్మవారిని కోరుకున్నారు. అలాగే పెద్దలు వేణు, అలహరి, సురేష్, లలిత తదితరులు పాల్గొని బోనాల ఏర్పాట్లు, ఫలహార బండి ఊరేగింపును ఎంతో ఘనంగా జరిపిస్తూ అంబరాన్ని తాకేలా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది.