The Paradise: ది ప్యారడైజ్ కిల్ విలన్

The Paradise: న్యాచురల్ స్టార్ నాని ఫుల్ జోష్‌లో ఉన్నారు! ఆయన లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ ‘హిట్-3’ మే 1న థియేటర్లలో సందడి చేయనుంది. అదే సమయంలో నాని తన కొత్త సినిమా ‘ది ప్యారడైజ్’ని ప్రకటించి అభిమానుల్లో హైప్ పెంచారు.
శైలేష్ కొలను డైరెక్షన్‌లో రూపొందిన ‘హిట్-3’లో నాని అర్జున్ సర్కార్ అనే రూత్‌లెస్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నారు. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే, శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ‘ది ప్యారడైజ్’ అనే సినిమా షూటింగ్ మే 2 నుంచి మొదలుకానుంది. నాని ఈ చిత్రంలో డిఫరెంట్ లుక్‌తో సర్‌ప్రైజ్ చేయనున్నారు.
మే మధ్యలో ఆయన షూటింగ్‌లో పాల్గొననున్నారు. ఈ మూవీలో బాలీవుడ్ నటుడు రాఘవ్ జుయల్ విలన్‌గా నటిస్తున్నారు. ‘కిల్’ సినిమాతో గుర్తింపు పొందిన రాఘవ్, నానితో తలపడడానికి సిద్ధమవుతున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం, సుధాకర్ చెరుకూరి నిర్మాణంలో రూపొందుతున్న ‘ది పారడైజ్’ భారీ అంచనాలు రేకెత్తిస్తోంది. నాని ఈ రెండు చిత్రాలతో బాక్సాఫీస్‌ను రాజ్యం చేయడం ఖాయమని అభిమానులు ఫుల్ కాన్ఫిడెంట్‌గా ఉన్నారు.