Kamini Kaushal: బాలీవుడ్ సీనియర్ స్టార్ కామినీ కౌశల్ కన్నుమూత!

Kamini Kaushal: బాలీవుడ్ తొలి తరం నటి కామినీ కౌశల్ కన్నుమూశారు. దిలీప్ కుమార్, రాజ్ కపూర్‌లతో నటించి ఫస్ట్ ఫిమేల్ స్టార్ అయ్యారు చివరి రోజుల్లో కూడా షారుఖ్, ఆమిర్ సినిమాల్లో ఆమె కనిపించారు.
1946లో ‘నీచా నగర్’ సినిమాతో బాలీవుడ్‌కు పరిచయమైన కామినీ కౌశల్ ఒక్కసారిగా స్టార్ నటిగా ఎదిగారు. దిలీప్ కుమార్, రాజ్ కపూర్, దేవ్ ఆనంద్, అశోక్ కుమార్‌లతో నటించి 1940 దశకంలోనే అత్యధిక పారితోషికం తీసుకునే నటిగా నిలిచారు. ‘ఆగ్’, ‘దో భాయ్’, ‘నదియా కే పార్’, ‘అర్జూ’ వంటి చిత్రాలు బ్లాక్‌బస్టర్ అయ్యాయి. 1963 తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మరో ఇన్నింగ్స్ ప్రారంభించారు. ‘దో రాస్తే’, ‘పురబ్ ఔర్ పశ్చిమ్’, ‘రోటీ కపడా ఔర్ మకాన్’లో తల్లి పాత్రలతో మెప్పించారు.
షారుఖ్ ఖాన్ ‘చెన్నై ఎక్స్‌ప్రెస్’లో అమ్మమ్మగా, ఆమిర్ ఖాన్ ‘లాల్ సింగ్ చద్దా’లో అతిథి పాత్రలో కనిపించి కొత్త తరాన్ని కూడా తన నటనతో ఆకట్టుకున్నారు. వ్యక్తిగత జీవితంలో కూడా ధైర్యం చాటిన కామినీ తన అక్క మరణం తర్వాత ఆమె భర్తను వివాహం చేసుకుని పిల్లలను పోషించారు. ఫిల్మ్‌ఫేర్ లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ సహా ఎన్నో అవార్డులు అందుకున్న ఈ తార చనిపోవడం హిందీ సినీ చరిత్రలో తీరని లోటుగా మిగిలింది.



