తెలంగాణ

వికారాబాద్ జిల్లా పరిగి లక్నాపూర్ ప్రాజెక్టులో బోటింగ్ ఏర్పాటు

వికారాబాద్ జిల్లా పరిగి మండలం లక్నాపూర్ ప్రాజెక్టులో బోటు సేవలను ప్రారంభించారు స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ టి రామ్మోహన్ రెడ్డి ఆయన సతీమణి ఉమా రెడ్డి. లక్నాపూర్ ప్రాజెక్ట్ ఎన్నో రోజుల పరిగి ప్రాంత ప్రజల కల నేడు నిజమైందని అన్నారు. లక్నాపూర్ ప్రాజెక్టులో తెలంగాణ టూరిజం శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన బోటు సేవలను ప్రారంభించినట్లు ఆయన తెలిపారు. ఎమ్మెల్యే దంపతులు స్వయంగా బోటులో ప్రయాణించారు. ఎన్నో రోజులుగా పరిగి ప్రాంత ప్రజల కల నెరవేరిందని ప్రతిరోజు పర్యాటక అభివృద్ధికి ఈ బోటు సేవలు కొత్త ఊపిరి నింపనున్నాయని తెలిపారు.

ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఒక వ్యక్తికి టికెట్ ధర ₹100 మాత్రమేనని, లక్నాపూర్ ప్రాజెక్టు అభివృద్ధి ద్వారా పర్యాటకంతో పాటు ప్రజలకు స్థానిక ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయని పేర్కొన్నారు. జిల్లాలో కోటిపల్లి ప్రాజెక్టులో బోటింగ్ సదుపాయం ఉందని మళ్లీ మన లక్నాపూర్ ప్రాజెక్టులో బోటింగ్ ఏర్పాటు చేశామని పర్యాటకులు పరిగి ప్రాంతంలోని ఈ ప్రాజెక్టులో బోటింగ్ చేసే సదుపాయం కల్పించామని అన్నారు. ఇక్కడ రాత్రి పూట ఉండేందుకు కూడా కాటేజ్ ల సౌకర్యం కూడా కల్పిస్తు టూరిజం డెవలప్మెంట్ చేస్తామని అన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button