తెలంగాణ

BJP: జులై 1న టీ.బీజేపీ కొత్త అధ్యక్షుడి ఎన్నిక

BJP: జులై 1న తెలంగాణ బీజేపీ కొత్త అధ్యక్షుడి ఎంపిక జరుగనుంది. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ రేపు విడుదల కానుంది. ఎల్లుండి నామినేషన్లు నమోదు కానున్నాయి. జులై 1న ఎన్నిక ప్రక్రియ పూర్తి కానుంది. అధ్యక్ష రేసులో ఈటల రాజేందర్ బండి సంజయ్, డీకే అరుణ, అర్వింద్ పేర్లు వినబడుతున్నాయి. మరోవైపు ఎన్నికల టీమ్ ఓటర్ లిస్ట్ రెడీ చేస్తోంది.

జాతీయ కౌన్సిల్ సభ్యుల ఎన్నికపై అభిప్రాయాల సేకరణ జరుగనుండగా జులై 1వ తేదీనే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి ప్రకటన వెలువడనుంది. కొత్త సారథి నేతృత్వంలో స్థానిక ఎన్నికలకు వెళ్తామంటున్నారు. తెలంగాణలో పార్టీని అధికారంలోకి తీసుకొచ్చే సామర్థ్యం ఉన్న నేతకే పగ్గాలు అప్పజెప్తామంటున్నారు బీజేపీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఎంపీ లక్ష్మణ్.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button