జాతియం
Bihar: బిహార్ అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ తొలి జాబితా విడుదల

Bihar: బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా బీజేపీ తమ తొలి జాబితా విడుదల చేసింది. 71 మందితో కూడిన తొలి జాబితాను బీజేపీ ప్రకటించింది. ఈ మేరకు తమ అభ్యర్థుల జాబితా రిలీజ్ చేసింది బీజేపీ. ఈ జాబితాలో 9 మంది మహిళలకు టికెట్ ఇచ్చింది బీజేపీ,. తారాపూర్ నుంచి డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌదరి బరిలో దిగనున్నారు.
లకిసరాయి నుంచి డిప్యూటీ సీఎం విజయసింహ పోటీచేయనున్నారు. సివన్ నుంచి మంగళ్ పాండే పోటీకి సిద్ధమయ్యారు. ఇక స్పీకర్ నందకిషోర్ యాదవ్‌కి టికెట్ దక్కలేదు. 243 సీట్లున్న బిహార్ అసెంబ్లీలో బీజేపీ పొత్తులో భాగంగా 101 సీట్లలో పోటీ చేయనుంది.



