తెలంగాణ
Ramchander Rao: బీజేపీ కార్యకర్తలను అరెస్ట్ చేయడం సరికాదు

Ramchander Rao: బాన్సువాడ అల్లర్ల ఘటనపై బీజేపీ చీఫ్ రాంచందర్ రావు స్పందించారు. శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న బీజేపీ కార్యకర్తలను అరెస్ట్ చేయడం సరికాదని రాంచంద్రరావు అన్నారు. ఓ మార్ట్‌లో అమ్మవారి పాటలు పెట్టినందుకు ఓ వర్గానికి చెందిన వ్యక్తి అడ్డుకోవడంతో ఈ సంఘటన చోటు చేసుకుందని రాంచందర్ రావు తెలిపారు.
సమాజంలో సామరస్య వాతావరణం, పరస్పర గౌరవం అత్యంత ముఖ్యమైనదని ఆయన తెలిపారు. దాడులకు పాల్పడిన ఓ వర్గం వ్యక్తులకు వదిలిపెట్టి కేవలం హిందూ యువకులపై కేసులు పెట్టడం సరికాదన్నారు. అరెస్టుకు గురైన మా కార్యకర్తలను వెంటనే విడుదల చేయాలని రాంచంద్రరావు డిమాండ్ చేశారు.



