తెలంగాణ
బీజేపీ నేత హనుమంతు మిస్సింగ్

జూబ్లీహిల్స్‌కు చెందిన ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి, బీజేపీ నేత బి.హనుమంతు అదృశ్యం అయినట్లు సమాచారం. రెండో భార్య ఇంట్లో నుంచి తన తండ్రి అదృశ్యమైనట్లు మొదటి భార్య కొడుకు పోలీసులను ఆశ్రయించాడు. ఇద్దరు భార్యల తర్వాత మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నట్లు గతంలో హనుమంతుపై ఆరోపణలు వెల్లువెత్తాగా నెలరోజుల క్రితం జూబ్లీహిల్స్‌లోని హనుమంతు ఇంటివద్ద ఆ మహిళ న్యూసెన్స్ చేసినట్లు తెలుస్తోంది. మహిళ న్యూసెన్స్ తర్వాత నుంచే హనుమంతు మిస్ అయినట్లు మొదటి భార్య కుమారుడు దత్తు ఆరోపిస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.



