Maheshwar Reddy: తెలంగాణ నమూనా ఏంటో అర్థం కావడం లేదు

Maheshwar Reddy: అసెంబ్లీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రవేశ పెట్టిన బడ్జెట్ ఇచ్చిన హామీలను పాతరేసేలా ఉందని బీజేపీ శాసన సభాపక్షనేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. తెలంగాణ వస్తే బతుకులు మారుతాయని అనుకున్నారు. కానీ, రాష్ట్రం అప్పుల కుప్పగా మారింది. పదేళ్లలో లక్షల కోట్లు అప్పు చేసింది గత ప్రభుత్వం గొప్పలకు పోయి గత ప్రభుత్వం నిధులు వృథా చేసింది అని ఆరోపించారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 15 మాసాలైన గత ప్రభుత్వ అవినీతి, అక్రమాలపై విచారణ జరపడం లేదు అని ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలు వాస్తవం కాదా వాస్తవం అయితే ఎందుకు కేసులు పెట్టడం లేదు అని ప్రశ్నించారు. దోచుకున్న సొత్తును రీకవరి చేసి ఆరు గ్యారంటీలకు ఖర్చు చేయాలి అని డిమాండ్ చేశారు.
ఆరు గ్యారంటిలకు కేటాయించిన నిధులు సరిపోవు ప్రభుత్వ పథకాలకు మంగళం పాడుతున్నారు. పారదర్శకత, జవాబుదారీతనం అంటే అప్పుల వివరాలను బయట పెట్టకపోవడమేనా? అని ఏలేటీ మహేశ్వర్ రెడ్డి అడిగారు. ఫోర్త్ సిటీ పేరుతో లంకె బిందెల కోసం పాకులాడుతుంది. రాష్ట్ర ప్రభుత్వం రైజింగ్ అంటుంది కానీ పేద ప్రజల్లో రైజింగ్ కనబడటం లేదు. నలుగురు మంత్రుల మధ్యే రైజింగ్ ఉంది. ప్రభుత్వం నిమిషానికి కోటి రూపాయల అప్పు చేస్తోంది.
జీఎస్టీ పెంచి చూపించడం 71 వేల కోట్లు అప్పు తీసుకురావడానికి చూపిస్తున్నట్లు ఉంది ఆరు గ్యారంటీలకు చట్ట భద్దత కల్పిస్తామన్న ముఖ్యమంత్రి మాట తప్పారు. ఆరు గ్యారంటీలకు నిధులు కేటాయించకపోవడం ప్రజలను మోసం చేసినట్లు కాదా? అని బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి అన్నారు.



