తెలంగాణ
ఢిల్లీలో పర్యటిస్తున్న బీజేపీ చీఫ్ రాంచందర్ రావు

తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడ రామచంద్రరావు ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఈరోజు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో రామచంద్రరావు భేటీ అవనున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పార్టీ పరిస్థితులు, ముఖ్యంగా ఇటీవల బీజేపీలో బండి సంజయ్, ఈటల రాజేందర్ మధ్య వచ్చిన విభేదాల నేపథ్యం గురించి చర్చించే అవకాశం ఉంది. అలాగే రాష్ట్రంలో బీజేపీ బలపర్చేందుకు తీసుకోవాల్సిన చర్యలు, విభాగాల్లో తలెత్తిన అసంతృప్తి నివారణ, భవిష్యత్ కార్యాచరణపై అమిత్ షాకు రిపోర్ట్ ఇవ్వనున్నారు.