తెలంగాణ
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.. నామినేషన్ వేసిన బీజేపీ అభ్యర్థి దీపక్ రెడ్డి

జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికకు బీజేపీ అభ్యర్థిగా లంకల దీపక్ రెడ్డి నామినేషన్ వేశారు. లంకల దీపక్ రెడ్డి నామినేషన్ కార్యక్రమంలో తెలంగాణ బీజేపీ చీఫ్ రామచందర్ రావు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ రఘునందనర్ రావు, ఎమ్మెల్యేలు కాటేపల్లి వెంకటరమణ రెడ్డి, పైడి రాకేషర్ రెడ్డి, ఎమ్మెల్సీలు అంజి రెడ్డి, మల్కా కొమరయ్య, ఇతర బీజేపీ నేతలు పాల్గొన్నారు. ఇక అంతకుముందు వెంకటగిరిలోని విజయదుర్గ పోచమ్మ గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించి భారీ ర్యాలీ చేపట్టారు బీజేపీ నేతలు.



