తెలంగాణ
Jubliee Hilss Bypoll: నేడు బీజేపీ అభ్యర్థి దీపక్ రెడ్డి నామినేషన్

Jubliee Hilss Bypoll: జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక బీజేపీ అభ్యర్థిగా లంకల దీపక్ రెడ్డి ఇవాళ నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ నేపథ్యంలోనే వెంకటగిరిలోని విజయదుర్గ పోచమ్మ గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి దర్శనం అనంతరం టెంపుల్ నుంచి షేక్‌పేట్ ఎంఆర్‌వో కార్యాలయం వరకు భారీ ర్యాలీగా తరలివెళ్తున్నారు.
కళారూపాల ప్రదర్శనతో డప్పు చప్పుళ్లతో ర్యాలీ కొనసాగుతోంది. ఇక ఈ ర్యాలీలో తెలంగాణ బీజేపీ చీఫ్ రామచందర్ రావు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ రఘునందనర్ రావు, ఎమ్మెల్యేలు కాటేపల్లి వెంకటరమణ రెడ్డి, పైడి రాకేషర్ రెడ్డి, ఎమ్మెల్సీలు అంజి రెడ్డి, మల్కా కొమరయ్య, ఇతర బీజేపీ నేతలు పాల్గొన్నారు.



