కాంత సినిమాలో బయోపిక్ ట్విస్ట్?

Kaantha: దుల్కర్ సల్మాన్ నటించిన కాంత మూవీ నవంబర్ 14న రిలీజ్ అవుతోంది. పీరియాడికల్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రం ఎంకే త్యాగరాజన్ బయోపిక్ అని టాక్. టీజర్, ట్రైలర్‌కు భారీ స్పందన లభించింది.
మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ కాంత చిత్రంతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. 1950ల మద్రాస్ ఇండస్ట్రీ నేపథ్యంలో హీరో, డైరెక్టర్ మధ్య వివాదాల చుట్టూ తిరిగే పీరియాడికల్ డ్రామా ఇది. దుల్కర్ హీరోగా, సముద్రఖని డైరెక్టర్‌గా నటిస్తున్నారు. రానా కీలక పాత్రలో కనిపించనున్నారు. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్. సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. రానా, దుల్కర్, ఇతరులు నిర్మిస్తున్నారు. టీజర్, ట్రైలర్, పాటలు అద్భుత స్పందన పొందాయి.
ఇప్పుడు మూడు రోజుల్లో రిలీజ్ కానుండగా, ఇది కోలీవుడ్ లెజెండ్ ఎంకే త్యాగరాజన్ బయోపిక్ అని తమిళ మీడియాలో వార్తలు వస్తున్నాయి. స్టేజ్ సింగర్‌గా ప్రారంభమై స్టార్ హీరో అయిన త్యాగరాజన్ అప్పట్లో మర్డర్ కేసులో చిక్కుకున్నారు. నిర్దోషిగా బయటపడ్డా ట్రాక్‌లోకి రాలేకపోయారు. ఈ జీవిత కథనే కాంతగా తీశారని ప్రచారం జరుగుతోంది. మరో పక్కా ఈ వార్త నిజం కాదని తెలుస్తుంది. అయితే ఇందులో నిజం ఎంత అనేది తెలియాలంటే థియేటర్లలో రిలీజ్ అయ్యేదాకా ఆగాల్సిందే.



