ఆంధ్ర ప్రదేశ్
Kurnool Bus Accident: మద్యం మత్తులో బైకర్.. సీసీ కెమెరా దృశ్యాలు వైరల్

Kurnool Bus Accident: కర్నూలు బస్సు ప్రమాదానికి కారణమైన బైకర్ సీసీ ఫుటేజ్ లభ్యమైంది. మద్యం మత్తులో పెట్రోల్ పంపు నుంచి బైకర్ వెళ్లినట్లు సీసీ కెమెరాలో రికార్డయ్యింది. ట్రావెల్స్ బస్సు కింద బైక్ పడటంతో అగ్నిప్రమాదం జరిగి 20 మంది సజీవ దహనమయ్యారు. ప్రమాదానికి ముందు పెట్రోల్ బంకుకు బైకర్ శివశంకర్ వెళ్లాడు.
అర్ధరాత్రి 2 గంటల 20 నిమిషాలకు పెట్రోల్ బంక్‌లో శివశంకర్ కనిపించాడు. శివశంకర్‌తో పాటు వీడియోలో మరో యువకుడు ఉన్నాడు. పెట్రోల్ బంక్ దగ్గర బైక్‌తో శివశంకర్ విన్యాసాలు చేశాడు. పెట్రోల్ బంక్ దగ్గరే స్కిడ్ అయి పడిపోబోయాడు. ప్రమాదం జరిగిన స్పాట్‌కి 2 కిలో మీటర్ల దూరంలో ఉన్న పెట్రోల్ బంక్‌లో ఈ విజువల్స్ రికార్డయ్యాయి.



