జాతియం
బీహార్ తొలి దశ ఎన్నికల పోలింగ్ ప్రారంభం

Bihar Assembly Elections: బిహార్ ఎన్నికల్లో మొదటి దశ నవంబర్ 6న… 18 జిల్లాల్లోని 121 స్థానాలకు పోలింగ్ జరగనుంది. తేజస్వి యాదవ్, సామ్రాట్ చౌదరి, విజయ్ సిన్హా వంటి ముఖ్యులు తలరాతను ఓటర్లు డిసైడ్ చేస్తారు. మొదటి దశలో 1,314 మంది అభ్యర్థులు బరిలో ఉండగా, వారి భవిష్యత్తును 3.75 కోట్ల మంది ఓటర్లు నిర్ణయించనున్నారు.
మొత్తం 243 సీట్లు ఉన్నా బిహార్ అసెంబ్లీలో 121 స్థానాల్లో మొదటి దశ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో 4.58 లక్షల మంది ఓటర్లతో అత్యధిక సంఖ్యలో ఓటర్లున్న నియోజకవర్గంగా దిఘా నిలవగా, అత్యల్పంగా షేక్‌పురా జిల్లాలోని బార్బిఘా నిలిచింది. 45వేల,341 పోలింగ్ స్టేషన్లలో ఓటింగ్ జరుగుతోంది. వీటిలో ఎక్కువ భాగం గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లోని 36వేల,733 బూత్‌లలో మొదటి దశ ఓటింగ్ జరుగుతుంది.



