Flora Saini: ప్రియుడితో నరకం చూసిన బాలయ్య హీరోయిన్!

Flora Saini: ఫ్లోరా సైని.. సినీ రంగంలో అడుగుపెట్టి, అనేక చిత్రాల్లో మెరిసిన కథానాయిక. ప్రేమ పేరుతో జీవితంలో కష్టాలు ఎదుర్కొన్న ఈ నటి, తన బాధను సోషల్ మీడియాలో పంచుకుంది. ఆ ఘటనలు ఏమిటి? ఆమె జీవితంలో ఏం జరిగింది? ఇప్పుడు బిగ్‌బాస్‌లో ఆమె ప్రయాణం ఎలా ఉంటుంది?
ఫ్లోరా సైని, 1999లో ప్రేమ కోసం సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైంది. నువ్వు నాకు నచ్చావ్, నరసింహ నాయుడు, లక్స్ పాప సాంగ్‌తో పేరు తెచ్చుకుంది. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, హిందీ చిత్రాల్లో నటించింది. రానా నాయుడు, ద ట్రయల్ వెబ్ సిరీస్‌లలోనూ సత్తా చాటింది. కానీ, 20 ఏళ్ల వయసులో ప్రేమలో పడిన ఫ్లోరా, ఓ నిర్మాతతో ప్రేమలో పడి దారుణ బాధలు అనుభవించిందట. తనపై వేధింపులు, శారీరక హింస, బంధీగా మారిన జీవితం ఆమెను నిస్సహాయ స్థితికి నెట్టాయట.
ప్రియుడు తన ఫోన్ లాక్ చేయడం, నటన నుంచి దూరం చేయడం, తనపై దాడులు చెయ్యడంతో ఒక రోజు తీవ్ర నొప్పితో పారిపోయిందట. ఆ బాధల నుంచి అమె కోలుకోవడానికి నెలలు పట్టిందట. ఫ్లోరా ఇప్పుడు బిగ్‌బాస్ 9లో కొత్త ప్రయాణం మొదలుపెట్టి అందరికీ షాక్ ఇచ్చింది. మరి బిగ్ బాస్ ఆమెకు ఎలాంటి పేరు తెప్పిస్తుందో చూడాలి.



