సినిమా
Big Boss 9: ‘బిగ్‌బాస్’ సీజన్ 9.. ‘ఈ సారి చదరంగం కాదు.. రణరంగమే’..

Big Boss 9: బిగ్ బాస్ తెలుగు 9వ సీజన్ సందడి మొదలైంది! నాగార్జున హోస్ట్‌గా మరోసారి మెరవనున్న ఈ షో కోసం అభిమానులు ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు.
బిగ్ బాస్ తెలుగు అభిమానులకు శుభవార్త! 9వ సీజన్ రణరంగంగా మారనుంది. గత ఎనిమిది సీజన్లు ఆడియన్స్‌ను అలరించాయి. ఎన్టీఆర్, నాని, నాగార్జున హోస్ట్‌గా విజయవంతంగా నడిపిన ఈ షోలో ఈసారి క్రేజీ కంటెస్టెంట్స్ రాంబోలా రానున్నారు. 8వ సీజన్‌కు ఆశించిన ఆదరణ లభించకపోవడంతో, ఈసారి జాగ్రత్తలతో పక్కా ప్లాన్‌తో బిగ్ బాస్ టీమ్ సిద్ధమైంది.
“చదరంగం కాదు, రణరంగం” అంటూ విడుదలైన పవర్‌ఫుల్ ప్రోమో ఆడియన్స్‌ను ఆకట్టుకుంటోంది. నాగార్జున మరోసారి హోస్ట్‌గా రానుండగా, త్వరలోనే షో ప్రారంభం కానుంది. కంటెస్టెంట్స్ ఎవరనేది ఇంకా సస్పెన్స్‌గా ఉంది. డ్రామా, ఎమోషన్స్, ఎంటర్‌టైన్‌మెంట్‌తో ఈ సీజన్ ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో వేచి చూడాలి.