బాహుబలి 3 లోడింగ్? అప్డేట్ ఎప్పుడంటే?

బాహుబలి సినిమా అభిమానులకు శుభవార్త. దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి బాహుబలి ఎపిక్‌ను మరోసారి థియేటర్లలోకి తీసుకొస్తున్నారు. అక్టోబర్ 31న రిలీజ్‌కు సిద్ధమవుతున్న ఈ చిత్రం గురించి అభిమానుల్లో ఉత్సాహం నెలకొంది. సోషల్ మీడియాలో జోరుగా చర్చలు సాగుతున్నాయి.
భారతీయ సినిమా చరిత్రలో మైలురాయిగా నిలిచిన బాహుబలి సిరీస్ మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. బాహుబలి: ది బిగినింగ్, బాహుబలి 2: ది కంక్లూజన్‌లను కలిపి ఒకే చిత్రంగా ‘బాహుబలి: ది ఎపిక్’ పేరుతో రిలీజ్ చేస్తున్నారు దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి.
అక్టోబర్ 31న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానున్న ఈ చిత్రం, ప్రభాస్, రాణా దగ్గుబాటి, అనుష్క, తమన్నాల శక్తివంతమైన నటనతో మహిష్మతి సామ్రాజ్య కథను మరోసారి ఆవిష్కరిస్తుంది. ఈ రీ-రిలీజ్‌లో కొత్త సన్నివేశాలు, మెరుగైన గ్రాఫిక్స్ ఉంటాయని అభిమానులు ఆశిస్తున్నారు.
సోషల్ మీడియాలో #BaahubaliTheEpic హ్యాష్‌ట్యాగ్‌తో చర్చలు ఊపందుకున్నాయి. రన్‌టైమ్ గురించి ఊహాగానాలు వినిపిస్తున్నప్పటికీ, రాజమౌళి ఈ విషయంలో రహస్యం కొనసాగిస్తున్నారు. అంతేగాక ఆరోజున బాహుబలి 3 అనౌన్స్మెంట్ కూడా ఉండొచ్చని సోషల్ మీడియాలో గట్టిగా వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తానికి ఈ ఎపిక్ సాగా మరోసారి బాక్సాఫీస్‌ను షేక్ చేయనుందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.