జాతియం

ధర్మస్థల కేసులో బిగ్ ట్విస్ట్..

Dharmasthala: కర్ణాటకలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ధర్మస్థలలో మృతదేహాల ఖననం కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. ధర్మస్థల కేసులో ఫిర్యాదు చేసిన వ్యక్తిని అరెస్ట్ చేశారు పోలీసులు. నిన్న సాయంత్రం ఈరోజు ఉదయం వరకుప్రశ్నల వర్షం కురిపించారు. సిట్‌కు తప్పుడు సమాచారం ఇచ్చినట్లు గుర్తించారు. ఫిర్యాదుదారుడు చెప్పినవి అబద్ధాలేనని సిట్ తేల్చింది.

1995 నుంచి 2014 వరకు మహిళల మృతదేహాలు పూడ్చానని పోలీసులకు మాజీ శానిటరీ వర్కర్ ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు ఆధారంగా ధర్మస్థలలో పలుచోట్ల తవ్వకాలు జరిపారు. తవ్వకాల్లో ఎలాంటి అస్థిపంజరాలు లభించలేదని సిట్ తెలిపింది. ఫిర్యాదుదారుడు చెప్పినవి అబద్ధాలేనని తేల్చింది.

మరోవైపు ఇదే కేసులో తన కూతురు అదృశ్యం అయ్యిందన్న సుజాత భట్.. మహిళ సంచలన విషయాన్ని బయటపెట్టారు. ధర్మస్థల వెళ్లిన తన కుమార్తె అదృశ్యమైందంటూ గతంలో తాను చెప్పినవన్నీ కట్టుకథలేనని అన్నారు. అసలు తనకు అనన్య భట్ అనే కుమార్తె లేదని వెల్లడించారు. ఇద్దరు ప్రముఖుల ప్రోద్బలంతోనే ఇలా చేశానని ఆరోపించారు. భూ వివాదం కారణంగానే కట్టుకథ అల్లినట్టు చెప్పారు. ప్రజలు, భక్తులు క్షమించాలంటూ వేడుకున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button