ఆంధ్ర ప్రదేశ్
Pastor Praveen: పాస్టర్ ప్రవీణ్ మృతి కేసులో మరో ట్విస్ట్

Pastor Praveen: పాస్టర్ ప్రవీణ్ మృతి కేసులో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. గతనెల 24న ఎన్టీఆర్ జిల్లా నందిగామ సమీపంలోని కీసర టోల్ ప్లాజా సమీపంలో బైక్ పైనుండి పాస్టర్ ప్రవీణ్ కిందపడిన దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. కింద పడిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డు అయ్యాయి. సమాచారం అందుకున్న టోల్ సిబ్బంది. 3నిమిషాల్లో ప్రవీణ్ దగ్గరకి వెళ్లినట్లు సమాచారం.
అలాగే ఫస్ట్ ఎయిడ్ చేసి టోల్గేట్ విశ్రాంతి గదిలో విశ్రాంతి తీసుకోవాలని చెప్పినట్లు టోల్ సిబ్బంది చెబుతున్నారు. అయితే ప్రవీణ్ తమ మాటలు వినలేదని, విశ్రాంతి తీసుకోకుండా చివరకు హెడ్ లైట్ లేకుండానే విజయవాడ వైపు వెళ్లినట్లు టోల్ సిబ్బంది చెబుతోంది.