సినిమా
అఖండ 2 నుంచి బిగ్ సర్‌ప్రైజ్!

Akhanda 2: నందమూరి బాలకృష్ణ అఖండ 2తో వచ్చేందుకు సిద్ధం అయ్యారు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో పాన్ ఇండియా సినిమాగా ఈ సినిమా రాబోతోంది. ఇదిలా ఉంటే బాలయ్య ఫ్యాన్స్‌కు క్రేజీ అప్‌డేట్ వచ్చేసింది. ఆ వివరాలు తెలుసుకుందాం.
అఖండ 2తో బాలకృష్ణ బాక్సాఫీస్‌ను షేక్ చేయడానికి రెడీ అవుతున్నారు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న ఈ పాన్ ఇండియా చిత్రంలో బాలయ్య తెలుగు, హిందీ డబ్బింగ్‌లను స్వయంగా చేస్తున్నారు.
భగవంత్ కేసరితో హిందీలో మెప్పించిన ఆయన, ఈసారి అఖండ 2తో మరింత ఆకర్షించనున్నారు. తెలుగు డబ్బింగ్ పూర్తై, హిందీ డబ్బింగ్ త్వరలో ప్రారంభం కానుంది. ఫ్యాన్స్ రిలీజ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా బ్లాక్‌బస్టర్ అఖండ కంటే గొప్పగా ఉంటుందని అంచనాలు ఉన్నాయి.



