2025లో చిన్న సినిమాల భారీ విజయాలు!

2025 సంవత్సరం భారీ బడ్జెట్ చిత్రాలతో నిండి ఉన్నప్పటికీ, కొన్ని తక్కువ బడ్జెట్ సినిమాలు అద్భుతమైన వసూళ్లతో అందరినీ ఆశ్చర్యపరిచాయి. కంటెంట్ బలం, పాజిటివ్ టాక్‌తో ఈ చిత్రాలు నిర్మాతలకు భారీ లాభాలు తెచ్చిపెట్టాయి. ఈ ఏడాది స్మాల్ ఫిల్మ్స్ డామినేట్ చేసిన ఏడాదిగా నిలిచింది.
2025లో పలు భారీ చిత్రాలు థియేటర్లలో విడుదలైనా, తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కిన కొన్ని సినిమాలు అనూహ్య విజయం సాధించాయి. ఈ చిత్రాలు మంచి కథాంశం, ఎమోషనల్ కనెక్ట్, వర్డ్ ఆఫ్ మౌత్ ప్రచారంతో బాక్సాఫీస్‌ను షేక్ చేశాయి. గుజరాతీ, తమిళ్, తెలుగు, కన్నడ భాషల్లో వచ్చిన ఈ సినిమాలు నిర్మాతలకు భారీ రిటర్న్స్ ఇచ్చాయి.
గుజరాతీ భక్తి డ్రామా ‘లాలో – కృష్ణ సదా సహాయతే’.. కేవలం 50 లక్షల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం 100 కోట్లకు పైగా వసూళ్లు సాధించి గుజరాతీ సినీ చరిత్రలో రికార్డు సృష్టించింది. తమిళంలో ప్రదీప్ రంగనాథన్ ‘డ్రాగన్’ కమింగ్ ఆఫ్ ఏజ్ కామెడీ డ్రామాతో 35 కోట్ల బడ్జెట్‌కు 150 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి బ్లాక్‌బస్టర్ అయింది. అదే భాషలో ససికుమార్ – సిమ్రాన్ ‘టూరిస్ట్ ఫ్యామిలీ’ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా 7 కోట్ల బడ్జెట్‌తో 90 కోట్లు సాధించింది.
తెలుగులో నాని నిర్మాణంలో, ప్రియదర్శి హీరోగా నటించిన కోర్ట్ సినిమా లీగల్ డ్రామాతో 10 కోట్ల బడ్జెట్ తో 57 కోట్లు వసూలు చేసింది. లిటిల్ హార్ట్స్ యూత్ & ఫ్యామిలీ డ్రామాగా 2 కోట్లతో 35 కోట్లు వసూలు చేసింది. కన్నడలో ‘సూ ఫ్రమ్ సో’ హారర్ కామెడీ సినిమాగా 5 కోట్ల బడ్జెట్ తో 50 కోట్లు పైగా రాబట్టింది. ఈ చిత్రాలన్నీ కంటెంట్‌ను కింగ్‌గా నిరూపించాయి.



