సినిమా

ఆమీర్‌ సినిమాకి బిగ్ షాక్ ?

Aamir Khan: బాలీవుడ్‌ సినిమాలు బాక్సాఫీస్‌ వద్ద బోల్తా కొడుతున్నాయి. ఆమీర్‌ ఖాన్‌ కొత్త చిత్రం ‘సితారే జమీన్‌ పర్‌’పై ఆశలు ఉన్నాయి. కానీ, అడ్వాన్స్‌ బుకింగ్స్‌ నీరసం ఆందోళన కలిగిస్తోంది. ఈ సినిమా బాలీవుడ్‌ని ఆదుకుంటుందా, లేక మరో నిరాశగా మిగుల్తుందా? అనేది ఆసక్తికరంగా మారింది.

టాలీవుడ్‌, కోలీవుడ్‌ సినిమాలు బాక్సాఫీస్‌ వద్ద వసూళ్ల సునామీ సృష్టిస్తున్నాయి. తొలి రోజు కోట్లలో కలెక్షన్స్‌తో రికార్డులు బద్దలవుతున్నాయి. కానీ, బాలీవుడ్‌ పరిస్థితి దారుణం. ఈ ఏడాది కొన్ని సినిమాలు మినహా మిగతావి నష్టాల్లో మునిగాయి. ఇప్పుడు ఆమీర్‌ ఖాన్‌ సినిమా ‘సితారే జమీన్‌ పర్‌’పై అందరి చూపు ఉంది. ఈ చిత్రం ‘తారే జమీన్‌ పర్‌’ సీక్వెల్‌గా ప్రచారం జరుగుతోంది.

ఆమీర్‌ ఈ సినిమా కోసం భారీగా ప్రచారం చేస్తున్నారు. ఇంటర్వ్యూలు, పీఆర్‌ యాక్టివిటీలతో హడావిడి చేస్తున్నారు. అయితే, రిలీజ్‌ సమీపిస్తున్నా అడ్వాన్స్‌ బుకింగ్స్‌ నిల్‌గా ఉన్నాయి. బాలీవుడ్‌లో ప్రీ-బుకింగ్స్‌ లేని సినిమాలు నష్టాల ఊబిలో కూరుకుపోతున్నాయి. ఈ సినిమా ఆ గతిని తప్పిస్తుందా? లేక బాలీవుడ్‌కి మరో షాక్‌ ఇస్తుందా? చూడాలి.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button